ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తిమ్రల్గా గ్రామ సమీపంలో కారు మైన్లోని నీటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచ్ కుటుంబం మృతి.. ఆ అమ్మాయి మాత్రం.. - తిమ్రాల్గా నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు
ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా ఒక కారు మైన్లోని నీటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారు.
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
పోలీసుల వివరాల ప్రకారం.. త్రిమల్గాకు చెందిన సర్పంచ్ మహేంద్ర పటేల్ తన తల్లిదండ్రులు, భార్య, కూతురు(15)తో ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా..ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లా తిమ్రాల్గా గ్రామంలో కారు అదుపు తప్పి మైన్లోని నీటి గుంటలో పడిపోయింది. ఆ కారులో ఉన్న వారందరూ నీట మునిగారు. ఆ కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అదృష్టవశాత్తు అమ్మాయి మాత్రం ఈదుకుంటూ వచ్చి మృత్యువు నుంచి బయటపడగలిగింది.
ఇవీ చదవండి:
Last Updated : Dec 30, 2022, 2:19 PM IST