మధ్యప్రదేశ్లో.. నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాగర్ జిల్లా బండాకు చెందిన ఓ బాలికపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లో.. నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాగర్ జిల్లా బండాకు చెందిన ఓ బాలికపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఏం జరిగిందంటే..
బండా గ్రామానికే చెందిన రోహిత్ తివారీ అనే వ్యక్తి.. భోపాల్ తీసుకెళ్లే నెపంతో బాలికను బస్సులో ఎక్కించుకున్నాడు. బస్సు కదిలే సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తల్లిదండ్రులకు బాలిక తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 9, 10 తేదీల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!