శుక్రవారం ఉదయం కేరళ శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం తెరుచుకుంది. ఉత్రం పండుగ సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఈ నెల 28 వరకు దేవాలయం తెరిచి ఉంటుందని తెలిపింది.
శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు - ఉత్రం పండగ
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. ఉత్రం పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేత పూజలు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.
తెరుచుకున్న శబరిమల ఆలయం
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ రిపోర్టు పత్రాన్ని వెంటతెచ్చుకోవాలని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:ఆకులాగే ఉంటాను.. కానీ పురుగును!