Sabarimala News: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శబరిమల ఆలయంపై విధించిన ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. మండల మకరవిలక్ సీజన్ సందర్భంగా భక్తులు ఆలయంలో నెయ్యితో అభిషేకం చేసేందుకు అనుమతించింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ సడలింపు వర్తించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శబరిమలలో ఆంక్షల సడలింపు- మరింత మంది భక్తులకు అవకాశం
Sabarimala News: శబరిమలలో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 60వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
శబరిమలలో ఆంక్షల సడలింపు
రోజుకు 60వేల మంది భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు అడవి మార్గం ద్వారా కూడా ప్రయాణించేందుకు అనుమతించింది. ఆదివారం నాటికి 8,11,235 మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా శనివారం ఒక్కరోజే 42,870 మంది భక్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :మహిళా కానిస్టేబుళ్లపైకి కత్తిపీటతో దూసుకొచ్చి..