తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మకర జ్యోతి దర్శనం- అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిమల - అయ్యప్ప భక్తులు ఇరుముడి

Sabarimala Makara Jyothi 2024 : హరహరి క్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన వేళ భక్తులు పులకించిపోయారు. 'స్వామియే శరణం అయ్యప్ప' అనే శరణుఘోషతో శబరి గిరులు మార్మోగిపోయాయి.

Sabarimala Makara Jyothi 2024 :
Sabarimala Makara Jyothi 2024 :

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 6:50 PM IST

Updated : Jan 15, 2024, 10:52 PM IST

Sabarimala Makara Jyothi 2024 :మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి కనిపించింది. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమైంది. మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు తలపై 'ఇరుముడి' కట్టుకుని ఉదయం నుంచి వేచి ఉన్నారు. జ్యోతి దర్శనంతో వేలాది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరించారు. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకర జ్యోతి దర్శన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తులు విశ్వసిస్తారు.

అంతకుముందు, సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో, అయ్యప్ప జన్మించిన, బాల్యం గడిపిన పందాళం ప్యాలెస్​ నుంచి పవిత్ర ఆభరణాలు (తిరువాభరణం) తెచ్చారు. 6.45 గంటలకు అయ్యప్ప విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించారు. అనంతరం హారతి ఇచ్చారు. అనంతరం గర్భగుడి ద్వారాలు తెరిచారు. గర్భాలయ ముఖద్వారాలు తెరవగానే అయ్యప్ప నామస్మరణ ఆలయం ప్రదేశాలు మార్మోగాయి.

మణికంఠుడి పట్టాభిషేకం
అయ్యప్ప స్వామి స్వయంగా తిరుగాడిన ప్రాంతమే పందాళం. అచ్చెన్‌ కోవిల్‌ నది ఇక్కడ ప్రవహిస్తుంటుంది. ఈ నదీ తీరంలో అయ్యప్ప మణికంఠుని పేరుతో 12 ఏళ్ల పాటు నివసించిన పందళ రాజ మందిరాన్ని నేటికీ సందర్శించవచ్చు. మణికంఠుడు తపస్సు చేయాలని నిర్ణయించకున్నాక అతని పట్టాభిషేకం కోసం చేయించిన ఆభరణాలను మకర సంక్రాంతి రోజు మాత్రం ధరిస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లు చెబుతారు. శబరిమల దివ్య మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా రాజలాంఛనాలతో పందాళ రాజ వంశీయుల ఆధ్వర్యంలో పూజలు జరిగేట్లు అనుగ్రహించాడు. అప్పటి నుంచి సంక్రాంతి సందర్భంగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా ఈ తిరువాభరణాలను పందళం రాచమందిరంలో ఉంచుతారు. వీటికి పెద్దఎత్తున భద్రత ఉంటుంది. పందళ రాజ వంశీయులు రోజూ వీటికి పూజలు చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Jan 15, 2024, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details