తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రెండు టీకాల్ని కలిపితే మెరుగైన ఫలితం!' - స్పూత్నిక్ వీ డోసులతో కలిపి ప్రయోగించి ఆస్ట్రాజెనెకా టీకా సమర్థతను పెంచాలి

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ను స్పుత్నిక్-వీ టీకాతో కలిపి ప్రయోగించాలని రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ సూచించింది. తద్వారా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతను పెంచొచ్చని పేర్కొంది. ఇలా టీకాలను కలిపి ప్రయోగించడం రీవ్యాక్సినేషన్​కు ఉపయోగపడొచ్చని ట్వీట్ చేసింది.

Russian research center suggests use of Sputnik V to boost efficacy of AstraZeneca vaccine
''స్పూత్నిక్ వీ'తో ఆక్స్​ఫర్డ్ టీకాను కలపండి'

By

Published : Nov 27, 2020, 3:23 PM IST

బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాకు స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ ఆసక్తికరమైన సూచన చేసింది. స్పుత్నిక్ వీ డోసులతో కలిపి ప్రయోగించి ఆస్ట్రాజెనెకా టీకా సమర్థతను పెంచాలని పేర్కొంది.

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా మధ్యంతర ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. డోసుల తీరును బట్టి రెండు రకాల సమర్థతను టీకా కనబర్చింది. అయితే టీకాపై అదనపు ట్రయల్స్​ నిర్వహించనున్నట్లు తాజాగా ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గమలేయ సంస్థ ఈ సూచన చేసింది.

"ఆస్ట్రాజెనెకా పూర్తి డోసు వల్ల 62 శాతం సమర్థత వచ్చింది. ఒకవేళ వారు కొత్తగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే.. 'స్పుత్నిక్ వీ'తో ఆస్ట్రాజెనెకా డోసును కలిపి ప్రయత్నించమని మేం సూచిస్తున్నాం. ఇలా టీకాలను కలపి ప్రయోగించడం రీవ్యాక్సినేషన్​కు ఉపయోగపడొచ్చు."

-గమలేయ సంస్థ ట్వీట్

ఆగస్టులో స్పుత్నిక్ వీ టీకాకు రష్యా ఆమోదించింది. తద్వారా కరోనాకు టీకాను ఆమోదించిన తొలి దేశంగా నిలిచింది. ట్రయల్స్​లో ఈ టీకా సమర్థత 92 శాతంగా ఉన్నట్లు తేలింది.

ఇదీ చదవండి-సుప్రీంకోర్టు సెలవుల్లో తొలిసారిగా సంక్రాంతి

ABOUT THE AUTHOR

...view details