Indian Man Marries Russian: పెళ్లికి కుల, మతాలే కాదు.. దేశాలు కూడా అడ్డుకాదని చాటి చెప్పింది ఓ ప్రేమ జంట. రష్యాకు చెందిన అమ్మాయిని.. ఝార్ఖండ్ అబ్బాయి.. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు. ఝార్ఖండ్‌లోని హఝారిభాగ్కు చెందిన అమిత్ అభిషేక్.. రష్యాకు చెందిన నేవీ అధికారి కూతురు సీన్యా ఎల్కినా కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. ఈ పెళ్లితో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
దేశాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన రష్యా అమ్మాయి, ఝార్ఖండ్ అబ్బాయి
Indian Man Marries Russian: ఝార్ఖండ్ హఝారిభాగ్లో అరుదైన సంఘటన జరిగింది. రష్యాకు చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు భారతీయుడు. వివాహానికి అమ్మాయి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కాగా అమ్మాయి రష్యా నేవీ అధికారి కూతురు.
అభిషేక్ ఉన్నత విద్యకోసం 2017లో రష్యాలోని సమర నగరానికి వెళ్లగా.. అక్కడ సీన్యాతో స్నేహం ఏర్పడింది. ఐదేళ్లుగా కొనసాగుతున్న వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సీన్యా అభిషేక్‌తో సహా భారత్‌కు వచ్చి ఇక్కడ ఓ ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. అభిషేక్, సీన్యా తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో భారతీయ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరగ్గా.. సీన్యా కుటుంబ సభ్యులందరూ వివాహానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి:ప్రేమ కోసం పురుషుడిలా మారిన మహిళ.. చివరకు ఏమైందంటే?