Ukraine air space closed:రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో.. ఎయిర్‌పోర్టులను, గగనతలాన్ని మూసివేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ దేశ రాజధాని కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ఇండియా విమానం వెనుదిరిగింది.
Air India Flight return to Delhi:
ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి 'ఏఐ1947' ఎయిర్ఇండియా విమానం బయల్దేరి వెళ్లింది. కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉంది. గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాన్ని వెనక్కి పిలవాలా? లేదా ప్రయాణాన్ని కొనసాగించాలా? అని భారత అధికారులు చర్చించి.. వెనక్కి పిలిపించేందుకే మొగ్గుచూపారు.
అదేసమయంలో, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీలో ల్యాండ్ అయింది. 182 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.