కొవిడ్-19ను వేగంగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)లు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశాయి. 'ఆర్‌టీ-ల్యాంప్' అనే ఈ సాంకేతికత సాయంతో కరోనాను చౌకలో గుర్తించొచ్చు. ఫలితాల విశ్లేషణకు ఎలాంటి ఆధునిక సాధనాల అవసరం ఉండదు. ఆసుపత్రుల్లో భారీ స్థాయిలో ప్రజల స్క్రీనింగుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
కరోనాను వేగంగా పసిగట్టే సాంకేతికత - కరోనా పసిగట్టే కొత్త సాంకేతికత
కరోనాను వేగంగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)లు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశాయి. 'ఆర్‌టీ-ల్యాంప్' అనే ఈ సాంకేతికత సాయంతో కరోనాను చౌకలో గుర్తించొచ్చు. ఫలితాల విశ్లేషణకు ఎలాంటి ఆధునిక సాధనాల అవసరం ఉండదు.
రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్- లూప్ మీడియేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ (ఆర్‌టీ-ల్యాంప్) అనే ఈ విధానం ద్వారా వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏను గుర్తించొచ్చు. సంప్రదాయ పీసీఆర్ విధానంతో పోలిస్తే ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఈ పరీక్షలో ఆర్‌ఎన్‌ఏ సేకరణ ప్రక్రియ ఉండదు. ఒక్క అంచెలోనే అది పూర్తవుతుంది. 'రంగు మార్పు' ఆధారంగా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం రెండు కంపెనీలకు ఈ సాంకేతికతను బదిలీ చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి:కొత్త మంత్రివర్గంలో కోటీశ్వరులు ఎందరంటే?