రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తరణ లక్ష్యంగా అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్) బెంగుళూరులో ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ్ సురేష్ భయ్యా జోషి ఆధ్వర్యంలో చన్నేనహల్లిలోని జనసేవా విద్యాకేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 450 మంది సంఘ్ ప్రతినిధులు, వివిధ విభాగాల్లో పనిచేసే 35 సంఘాల వారు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు. సంఘ్ విస్తరణపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో.. మార్చి 20న ఆర్ఎస్ఎస్ నూతన సర్ కార్యవాహ్(జనరల్ సెక్రటరీ)ను ఎన్నుకుంటారు సభకు హాజరైన కార్యకర్తలు.