గుజరాత్లోని గాంధీనగర్లో.. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల సమావేశం మంగళవారం ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.
గాంధీనగర్లోని కర్నావతి విశ్వవిద్యాలయ క్యాంపస్లో జరగనున్న ఈ కార్యక్రమంలో 25కుపైగా అనుబంధ సంస్థల నుంచి 150కుపైగా సభ్యులు హాజరుకానున్నారు. వీరందరు తమ అనుభవాలు, అనేక విషయాలపై వారి వద్ద ఉన్న సమాచారాలు, ఇతర వ్యవహారాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ "సమన్వయ్" సమావేశం ఏడాదికి రెండుసార్లు జరుగుతుంటాయి. అయితే ఇందులో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో దాదాపు 150 కార్యకర్తలు పాల్గొననున్నారు. కరోనా సంక్షోభం అనుభవాలు, కొత్తగా చేరిన వారి ద్వారా సంస్థలను విస్తరించడం వంటి అంశాలు ఈసారి చర్చించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించే విషయం కూడా ఈసారి చర్చకు వచ్చే అవకాశముందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రాముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి:-అయోధ్య గుడిపై ఊరూరా ప్రచారం