తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రాలకు మరో రూ.14,744 కోట్ల సాయం - కేంద్ర కేబినెట్

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ(ఈసీఆర్​పీ-2) కింద రాష్ట్రాలకు మరో రూ.14,744.99 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ నిధులతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కరోనా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Emergency Response & Health System Preparedness Package
కొవిడ్ అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ

By

Published : Aug 14, 2021, 6:29 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ(ఈసీఆర్​పీ-2 ప్యాకేజీ) కింద రాష్ట్రాలకు మరో రూ.14,744.99 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ పథకం కింద జులై 22న రూ.1827.80 కోట్లు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కరోనా నివారణకు అవసరమైన చర్యలు వేగవంతం అవుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జులై 8న.. రూ.23,123 కోట్లతో ఈసీఆర్​పీ-2 ప్యాకేజిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం 2022 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా నివారణ కోసం వైద్య మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం

ఇదీ చూడండి:Coronavirus Update: కేరళలో కొత్తగా 20వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details