దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా వినూత్నంగా నిరసన తెలిపారు. దిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని ఆయన నివాసం నుంచి కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లారు. ఇంధన ధరల పెంపు వల్ల సామన్యులు, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాబర్ట్ వాద్రా తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
'పెట్రో బాదుడు'కు నిరసనగా సైకిల్ తొక్కిన వాద్రా
ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దిల్లీలోని ఆయన నివాసం నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వెళ్లారు. ప్రధాని తన వైఫల్యాన్ని గత ప్రభుత్వాలపైకి నెట్టేస్తున్నారని విమర్శించారు.
ఇంధన ధరలకు నిరసనగా సైకిల్ తొక్కిన వాద్రా
గత ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయన్న మోదీ ఆరోపణలను రాబర్ట్ వాద్రా ఖండించారు. ప్రధాని తన వైఫల్యాన్ని గత ప్రభుత్వాలపైకి నెట్టేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రజా సమస్యలను విని ఇంధన ధరలు తగ్గించాలని వాద్రా కోరారు. ఇటు మధ్యప్రదేశ్‌లో పెట్రోల్, డిజీల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సైకిల్‌పై శాసనసభకు వెళ్లారు.
ఇదీ చదవండి :మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ లొంగుబాటు