తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిగ్నల్​కు ముసుగు.. ట్రైన్​కు బ్రేకు.. అరగంటలో సర్వం దోపిడీ - మహారాష్ట్ర దేవగిరి ఎక్స్​ప్రెస్

robbery in Devagiri express: చోరీలకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది ఓ దొంగల గుంపు. ఇళ్లలో కాకుండా రైలులో చోరీకి పాల్పడింది. చోరీకి అంబులెన్స్​ను వాహనంగా మార్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

robbery in devagiri express
రైలులో చోరీ

By

Published : Apr 22, 2022, 4:03 PM IST

robbery in Devagiri express: రైలు సిగ్నల్​ బోర్డుకు వస్త్రాలను కట్టి, ట్రైన్​ ఆగేలా చేసింది ఓ దొంగల ముఠా. వెంటనే దుండగులు రైలు బోగీలపై రాళ్ల దాడి చేశారు. దేవగిరి ఎక్స్​ప్రెస్​ కోచ్​లలోకి ప్రవేశించి ప్రయాణికుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, పర్సులు, మహిళా ప్రయాణికుల ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పొతూల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది.

అసలేం జరిగిందంటే..: 10మంది దుండగులు గుంపుగా వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందుకోసం అంబులెన్స్​ను వాహనంగా వాడారు. దేవగిరి ఎక్స్​ప్రెస్​ పొతూల్ రైల్పే స్టేషన్​ సమీపానికి వచ్చేసరికి సిగ్నల్ ఆగేలా చేశారు. దీంతో రైలు డ్రైవరు ట్రైన్​ను ఆపి.. స్టేషన్ మాస్టర్​కు ఫోన్ చేశాడు. ఇంతలో రాళ్లతో దాడి చేసుకుంటూ దొంగలముఠా రైలు కోచ్​లలోకి ప్రవేశించింది. దీంతో ప్రయాణికులు భయంతో అరుపులు మొదలుపెట్టారు. మొత్తం అర గంటలోనే ఈ చోరీ అంతా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దౌలతాబాద్​, ఔరంగాబాద్, లాసుర్ పట్టణాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:ఉగ్రదాడిలో జవాను వీరమరణం.. ఎన్​కౌంటర్​లో ఆరుగురు తీవ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details