తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షణాల్లోనే జీవితాలు తారుమారు- బస్సు, లారీ ఢీకొని ఆరుగురు మృతి - యాక్సిడెంట్ న్యూస్

Road Accident News Today: మధ్యప్రదేశ్​లోని బైతుల్​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. బస్సు ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.

road accident news today
మధ్యప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం

By

Published : Dec 1, 2021, 7:04 PM IST

Road Accident News Today: బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 25 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మధ్యప్రదేశ్​లోని బైతుల్​ జిల్లా నర్ఖేడ్​ గ్రామం సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ప్రభాత్​పట్టాన్​ నుంచి ముల్తాయ్​కు ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. రెండు వాహనాలూ బోల్తా పడ్డాయని చెప్పారు.

మృతులను షేక్​ రషీద్(65), ఛాయా పాటిల్​(40), సునీల్​ పిపర్దే(45), భీమ్​రావ్​ ధోటే(60), దేవరాజ్​ పండోలే(60), తేజస్వీ(19)గా అధికారులు గుర్తించారు.

ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, మృతుల కుటుంబసభ్యులకు సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి :'దేశంలో యూపీఏ కూటమే లేదు.. ప్రత్యామ్నాయం అవసరం'

ABOUT THE AUTHOR

...view details