Purnea Accident: బిహార్ పూర్ణియాలోని జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 57పై పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో ట్రక్కులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
ట్రక్కు బోల్తా పడి 8 మంది కూలీలు దుర్మరణం
Bihar Accident: పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి 8 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పూర్ణియాలో ఈ దుర్ఘటన జరిగింది.
అయితే ట్రక్కు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్థానికులు మాత్రం అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు అన్పించిందని తెలిపారు. అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఘటనలో మరణించినవారంతా రోజూ కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారేనని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే!