తెలంగాణ

telangana

జోగులాంబ గద్వాల జిల్లాలో బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు - మహిళ సజీవదహనం, పలువురికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 8:42 AM IST

Updated : Jan 13, 2024, 2:14 PM IST

Road Accident in Jogulamba Gadwal District Today : జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి చౌరస్తా వద్దకు రాగానే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చేలరేగడంతో ఓ మహిళ సజీవ దహనం కాగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Road Accident in Jogulamba Gadwal District Today
Road Accident in Jogulamba Gadwal District Today

బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు

Road Accident in Jogulamba Gadwal District Today : సంక్రాంతి పండుగను ఇంటి వద్ద జరుపుకునేందుకు వారంతా బస్సులో బయల్దేరారు. తమ కుటుంబ సభ్యులను ఎప్పుడు చూస్తామనే ఆతృతతో వారు ఉన్నారు. అలాగే నిద్రలోకి జారుకున్నారు. కాసేపు వారి ప్రయాణం సజావుగా సాగింది. కానీ అంతలోనే ఊహించని రోడ్డు ప్రమాదం వారిని ఉలిక్కిపడేలా చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా బెటాలియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Bus Accident in Jogulamba Gadwal :హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో, ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయటకు వచ్చారు.

బస్సును ఢీకొట్టిన డంపర్- 13మంది సజీవదహనం

బస్సులోనే మహిళ సజీవ దహనం : ఈ క్రమంలోనే ఓ మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ లోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళ సజీవ దహనమైంది. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందిని మంటలను అదుపు చేశారు.

ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన

మృతురాలు మాలతి

Fire Accident in Jogulamba Gadwal Today : బాధితులను కర్నూల్, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అందులో ఒకరిని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలు మెహదీపట్నానికి చెందిన మాలతిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. బస్సు 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిందని చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఎర్రవల్లి చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడటంతో బస్సులో మంటలు చేలరేగాయని పోలీసులు పేర్కొన్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద స్థలాన్ని గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా తిరుపతయ్య పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న ఆమె., గాయపడిన వారి పరిస్థితిని ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకునే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

"డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని మాకు సమాచారం వచ్చింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాం. అప్పటికే బస్సులో మంటలు చేలరేగాయి. ప్రయాణికులు అందులోంచి బయటకు వచ్చారు. ఒక మహిళ మాత్రం బయటకు రాలేకపోయింది. ఆమె బస్సులోనే సజీవ దహనమైంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు."- పోలీసులు

బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం

మద్యం మత్తులో ఒకరిని బలి తీసుకున్న జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్

Last Updated : Jan 13, 2024, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details