దేశంలో రద్దీ ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాలకు ఏప్రిల్, మే నెలల్లో 674 ట్రిప్పుల్లో 330 అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. గోరఖ్పుర్, పట్నా, దర్భంగా, ముజఫర్పుర్, భాగల్పుర్, వారణాసి, గువాహటి, అలహాబాద్, రాంచీ, లఖ్నవూ, కోల్కతా తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతుంది. కొవిడ్ కారణంగా సాధారణ ప్రయాణికులకు సంబంధించి అదనపు రద్దీ అంతగా లేనప్పటికీ.. సొంతూళ్లకు పయనమయ్యే వలస కార్మికుల తాకిడి ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి.
ఏప్రిల్- మే నెలల్లో 330 అదనపు రైళ్లు.. - భారత రైల్వే వ్యవస్థ
దేశంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అదనపు రైళ్లను నడపనుంది రైల్వేశాఖ. ఏప్రిల్, మే నెలల్లో 674 ట్రిప్పుల్లో 330 అదనపు రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70 శాతం రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ ఆదివారం తెలిపారు.
అదనపు రైళ్లు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70 శాతం రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ ఆదివారం తెలిపారు.
ఇదీ చదవండి :'సీఎంల భేటీలో మమత గైర్హాజరుకు కారణమేంటి?'