తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీతో పునర్జన్మ

తీవ్ర గాయాలపాలైన ఓ కొండ చిలువను కాపాడింది ఓ స్వచ్ఛంద సంస్థ. పైథాన్​కు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు వైద్యులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Rescued python
పైథాన్

By

Published : Sep 8, 2022, 12:47 PM IST

Updated : Sep 8, 2022, 2:35 PM IST

కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీతో పునర్జన్మ

తీవ్రగాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో దొరికిన పది మీటర్ల పొడవైన కొండ చిలువను ఒక స్వచ్ఛంద సంస్థ.. అటవీశాఖ సిబ్బంది సాయంతో కాపాడింది. ముంబయిలోని ఒక కాలువలో పడి ఉన్న కొండ చిలువను రెస్కింక్‌ అసోషియేషన్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ వెల్ఫేర్‌, అటవీశాఖ సిబ్బంది ఆగస్టులో గుర్తించారు. దాని శరీరంలో అనేక చోట్ల విరగడం వల్ల.. పైథాన్​కు తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. నోటిలోనూ గాయాలు కావడం వల్ల కొండ చిలువ ఆహారం తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది.

గాయపడిన పైథాన్

చావు అంచులకు వెళ్లిన సమయంలో కొండ చిలువను బతికించేందుకు స్వచ్చంద సంస్థ చొరవ తీసుకుంది. కొందరు వెటర్నరీ డాక్టర్ల బృందం సాయంతో రెస్కింక్‌ అసోషియేషన్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ వెల్ఫేర్‌ అనే స్వచ్ఛంద సంస్థే కొండ చిలువకు చికిత్స చేయిస్తోంది. తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ కొండ చిలువ చికిత్సకు స్పందిస్తోంది. ఇప్పటికే కొండ చిలువకు రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అటవీశాఖ సిబ్బంది వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు. ఆహారం తీసుకునే నాళం దెబ్బతినడం వల్ల తాజాగా కొండచిలువకు రీకన్‌స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీని చేశారు.

పైథాన్​కు ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు

కొండ చిలువ పూర్తిస్థాయిలో కోలుకుంటే తిరిగి అడవిలో వదలిపెట్టాలని అటవీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు భావిస్తున్నారు. అది పూర్తికోలుకుని.. అడవిలో తిరిగే స్థాయికి చేరుకోవడానికి మరికొన్ని నెలలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

కొండచిలువకు శస్త్రచికిత్స

ఇవీ చదవండి:అమిత్​ షా టూర్​లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్​చల్.. చివరకు...

'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

Last Updated : Sep 8, 2022, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details