తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తపోవన్​ సొరంగం వద్ద సహాయక చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్​ తపోవన్​ టన్నెల్​ వద్ద సహాయక చర్యలు నిలిచిపోయాయి. వాటర్​ లీకేజీ కారణంగా.. సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తిందని అధికారులు తెలిపారు. ఈ నెల 17న సంభవించిన జలప్రళయం ధాటికి ఇప్పటివరకు 58 మంది చనిపోయారు.

rescue-work-stopped-in-tapovan-tunnel-due-to-water-leakage
తపోవన్​ సొరంగం వద్ద సహాయక చర్యలకు ఆటంకం

By

Published : Feb 16, 2021, 6:52 PM IST

ఉత్తరాఖండ్​లోని తపోవన్ ‌సొరంగం వద్ద మరోసారి సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వాటర్​ లీకేజీనే కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటిని పంపింగ్​ యంత్రాలతో బయటకు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం.. రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతుందని పేర్కొన్నారు.

తపోవన్​ టన్నెల్​లో వాటర్​ లీకేజీ

రైనీ, తపోవన్​ సహా తదితర గ్రామాల్లో ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్​, డాగ్​ స్వ్కాడ్​ బృందాలు.. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

చమోలీ జిల్లా మేజిస్ట్రేట్​ స్వాతి భదోరియా.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత.. బాధిత కుటుంబాలను కలిశారు.

సహాయక చర్యలను పరిశీలిస్తున్న చమోలీ మేజిస్ట్రేట్​ స్వాతి
అధికారులతో సహాయక చర్యలపై ఆరా

58 మృతదేహాలు లభ్యం..

ఈ నెల 7న ధౌలిగంగ ఉద్ధృతితో సంభవించిన జలప్రళయంలో.. 200 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 58 మృతదేహాలు లభ్యమయ్యాయి. చమోలీ జిల్లాలో గత 10 రోజులుగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెలికితీసిన మృతదేహాల్లో 31 మందిని గుర్తించారు.

ఇదీ చూడండి: జగన్​, కేసీఆర్​ ఫొటోలకు గంగానదిలో పుణ్యస్నానం

ABOUT THE AUTHOR

...view details