మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం (Farm Laws repeal) దురదృష్టకరమని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, శెత్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ పేర్కొన్నారు. రాజకీయ కోణంతో తీసుకున్న ఈ నిర్ణయంతో (Farm laws taken back) రైతుల ఆందోళన ఆగిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వరకు నిరసన (farm laws withdrawn) కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారన్న ఘన్వాట్.. ఆందోళన తారస్థాయికి చేరినప్పుడు స్పందించని కేంద్రం, ఇప్పుడు వారికి తలవంచిందని (farm laws withdrawn) వ్యాఖ్యానించారు.
"సమస్య పరిష్కారం కోసం చట్టాలను ఉపసంహరించడానికి (farm laws withdrawn) బదులు ఇతర విధానపరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సింది. కానీ, రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. యూపీ, పంజాబ్‌లో గెలవాలని కేంద్రం ఈ నిర్ణయం (Farm laws taken back) తీసుకుంది. ఇది దురదృష్టకరం. దీనివల్ల (Farm Laws repeal) ఎలాంటి మంచి జరగదు. రైతులకు (చట్టాల్లో) స్వేచ్ఛ కల్పించారు. స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత జరిగినట్లుగా రైతులు ఇకపైనా దౌర్జన్యానికి గురవుతారు. పార్లమెంట్లో ఆమోదించే సమయంలో సరిగా చర్చ జరిపి ఉంటే, లేదా పార్లమెంటరీ ప్యానెల్‌కు సిఫార్సు చేసి ఉంటే.. చట్టాలు కొనసాగేవి."
-అనిల్ ఘన్వాట్
మూడు చట్టాల్లో రెండు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయని (Farm Laws repeal) ఘన్వాట్ గుర్తు చేశారు. కొత్త చట్టాల్లో (farm laws withdrawn) కొన్ని నిబంధనల అమలును నిలిపివేసినా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలను ప్రవేశపెట్టాయని చెప్పారు.
'నివేదికను మేమే విడుదల చేస్తాం'