నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమకారులకు మమతా బెనర్జీ నివాళులర్పించారు. నాటి ఘటనను చీకటి అధ్యాయంగా అభివర్ణించిన దీదీ.. నందిగ్రామ్ గడ్డ నుంచి బంగాల్ వ్యతిరేకులపై పోరాడతానని ప్రకటించారు.
మార్చి 14ను టీఎంసీ 'నందిగ్రామ్ దివస్'గా పాటిస్తోంది.
నందిగ్రామ్ ఓటర్లను తన సోదర, సోదరీమణులుగా అభివర్ణించిన మమత.. వారిచ్చిన ప్రోత్సహంతోనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వారి మద్దతుతో బంగాల్ వ్యతిరేక శక్తులపై పోరాడతానని తెలిపారు. 2007 నాటి హింసలో అమరులైన వ్యక్తుల కుటుంబాలతో కలసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు మమత.
ఇదే రోజు ఎంతోమంది అమాయకులను కాల్చి చంపారు. చాలా మృతదేహాలు కనీసం లభ్యం కాలేదు. చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. నాడు ప్రాణాలొదిలిన వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నా.