తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెమ్‌డెసివిర్‌ మంత్రదండం కాదు: గులేరియా - రెమ్​డెసివిర్​పై గులేరియా

కొవిడ్ చికిత్స కోసం వినియోగిస్తున్న రెమ్​డెసివిర్.. బాధితులు ఆసుపత్రుల్లో ఉండే రోజులను మాత్రమే తగ్గిస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్​దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. అది త్వరగా కోలుకునేలా చేసే మంత్రదండమైతే కాదని పేర్కొన్నారు.

randeep guleria, AIIMS director
రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

By

Published : Apr 18, 2021, 6:50 AM IST

కొవిడ్‌-19 చికిత్స కోసం వాడుతున్న రెమ్‌డెసివిర్‌ వల్ల బాధితులు ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు మాత్రమే తగ్గుతాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. మరణాలను అది ఆపలేదని అధ్యయనాల్లో తేలినట్లు చెప్పారు.

"అది త్వరగా కోలుకునేలా చేసే మంత్ర దండమేమీ కాదు. ఆక్సిజన్‌ స్థాయి తక్కువై, ఆసుపత్రుల్లో చేరిన వారికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. స్వల్పస్థాయిలో వ్యాధి లక్షణాలున్న వారికి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. అవసరం లేనప్పుడు ఇవ్వడం వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది"

--రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్.

కొవిడ్‌ ఉన్నవారికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగిటివ్‌ ఫలితం వస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించారు.

"ఆర్‌టీ-పీసీఆర్‌లో పాజిటివ్‌ వస్తే 100% కొవిడ్‌ సోకినట్లే భావించాలి. నెగెటివ్‌ వస్తే మాత్రం దాన్ని పూర్తిగా విశ్వసించలేం. అందువల్ల అనుమానం ఉన్నవారు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ తీయించుకోవాలి. అందులో లక్షణాలు కనిపిస్తే కొవిడ్‌ సోకినట్లుగానే భావించాలి"

--రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్.

కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న 2 వారాల తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని గులేరియా చెప్పారు. "అయినప్పటికీ ముక్కు, నోట్లోకి కొవిడ్‌ వైరస్‌ చేరడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష చేయించుకున్నప్పుడు పాజిటివ్‌ వస్తుంది. అయితే అది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌గా రూపాంతరం చెందదు. మరణాలు, ఐసీయూ చేరికలను తగ్గించడానికే ప్రభుత్వం వ్యాక్సిన్‌ను తెచ్చింది. వ్యాక్సిన్‌ వల్ల కొంతవరకే రక్షణ లభిస్తుంది. టీకా పొందినవారూ మాస్క్‌ ధరించాలి. వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది" అని తెలిపారు.

ఇదీ చదవండి:'కుంభమేళా భక్తులను వెనక్కి పంపండి'

ABOUT THE AUTHOR

...view details