Two Headed Snake: ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉంటాయి. అయితే కొన్ని పాములు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఒకటి రెండు తలల పాము. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో ఈ అరుదైన పాము కనిపించింది. అయితే దీనిని చూడడానికి గ్రామస్థులు, చుట్టుపక్క ప్రజలు తరలివచ్చారు. ఇలాంటి పామును చూడటం ఇదే తొలిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.
జిల్లాలోని బలోడా ప్రాతంలో గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో పరదేశి కన్వర్ ఇంటి ఆవరణలో కనిపించింది. కొందరు గ్రామస్థులు భక్తితో ధూపదీపాలను వెలిగించి పూజలు కూడా చేశారు. అనంతరం ఆ పామును అడవిలో విడిచిపెట్టారు. అయితే ఇది అరుదైన సర్పం అని, చాలా నెమ్మదిగా కదులుతుందని పర్యావరణవేత్తలు తెలిపారు. వాటి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.