సాధారణంగా ఆవు దూడలు రెండు కళ్లు, ఓ తలతో పుడతాయి. కానీ ఒడిశా నవరంగ్పుర్ జిల్లాలోని రాయ్‌గఢ్ ప్రాంతంలో మాత్రం అరుదైన లేగదూడ జన్మించింది. రెండు తలలు(Two-Headed Calf), రెండు నాలుకలు, మూడు కళ్లతో పుట్టిన ఈ దూడ వింతగా ఉండి చూసేందుకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు బిజపుర ప్రాంతానికి తరలివస్తున్నారు. నవరాత్రుల సమయంలో పుట్టినందున చాలా మంది దీనిని దుర్గామాతా ప్రతిరూపంగా కొలుస్తున్నారు. పూజలు నిర్వహిస్తున్నారు.