Rape in sampark kranti express: మధ్యప్రదేశ్ భోపాల్లో దారుణం జరిగింది. ఓ యువతిపై రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు కిరాతకుడు. సంపర్క్ క్రాంతి రైలు యశ్వంత్పుర్ నుంచి హజ్రత్ నిజాముద్దిన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు 15 మంది చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Rape in train
యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కుర్చునేందుకు సీటు దొరకలేదు. దీంతో వంటచేసే బోగీలో ఖాళీ స్థలం ఉందని, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చని యువతిని నమ్మించి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రేప్ పై సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన భోపాల్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. వంటచేసే బోగీ వద్దకు వెళ్లగా అందులో ఉన్న వారు డోర్ ఓపెన్ చేయలేదు. అయితే పోలీసులు ఒత్తిడి చేశాక అరగంట తర్వాత తలుపులు తెరిచారు. అందులో బాధితురాలు అపస్మాకర స్థితిలో పడి ఉంది. ఏమీ మాట్లాడలేకపోయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. చికిత్స అనంతరం బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 15 మంది చిరువ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలు నిందితుడిని గుర్తించేందుకోసం వారిని విచారించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:రూ.6.52 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్!