తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్​ లైక్స్​తో రేప్​ కేసు నుంచి ఊరట! - ఢిల్లీ హైకోర్టు న్యూస్

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ ఓ వ్యక్తిని రేప్​ కేసు నుంచి తప్పించేలా చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో ఆ వ్యక్తికి మధ్యంతర బెయిల్ లభించింది. అసలేం జరిగిందంటే..

facebook, Delhi HC
దిల్లీ హైకోర్టు, ఫేస్​బుక్

By

Published : Jun 30, 2021, 10:41 PM IST

రేప్​ కేసులో నిందితుడైన ఓ వ్యక్తికి ఊరట లభించేలా చేసింది సామాజిక మాధ్యమం ఫేస్​బుక్. లైక్​, కామెంట్​ అనే ఆప్షన్​.. ఆయనపై నమోదైన కేసు తప్పని రుజువు చేసేందుకు ఓ ఆధారంగా మారింది. ఇది ఎలా సాధ్యపడిందంటే..

ఇదీ జరిగింది..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఓ మహిళ మే 8న ప్రేమ్​ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 2018 జులై నుంచి వారు సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిపై చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని జస్టిస్​ సీ హరిశంకర్​తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

పిటిషనర్​కు పెళ్లైందని తెలిసే..

తొలుత.. పిటిషనర్​ తరఫున వాదించిన న్యాయవాది.. పిటిషనర్​కు పెళ్లైనట్లు ఆయనపై ఆరోపణలు చేసిన మహిళకు ముందుగానే తెలుసని వాదించారు. ఇద్దరు కలిసే తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని తెలిపారు. పిటిషనర్​ ఫేస్​బుక్​లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఆ మహిళ లైక్​ చేసిందని పేర్కొన్నారు. దానిపై కామెంట్ కూడా చేసిన ఆధారాలను ధర్మాసనం ముందు పొందుపరిచారు.

ఈ వాదనలు విన్న ధర్మాసనం.. గతంలోను ఇలాంటి కేసులను పక్కకుపెట్టినట్లు తెలిపింది. అయితే.. పెళ్లైందని తెలిసి మరో మహిళకు వివాహం చేసుకుంటా అని మాట ఇవ్వడం తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. నిందితుడికి సెక్షన్ 376 కింద శిక్ష విధించనున్నట్లు తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి:వాట్సాప్​ నోటీసులపై 'స్టే'కు హైకోర్టు నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details