రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు లద్దాఖ్ వెళ్లనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు బలగాల సన్నద్ధతను సమీక్షించనునన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే కూడా పాల్గొననున్నారు. సరిహద్దు ప్రతిష్టంభనపై చైనాతో చర్చలు జరిగిన రెండు రోజులకే రక్షణ మంత్రి ఈ పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాంగాంగ్ సరస్సు నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకున్నాక రాజ్‌నాథ్ తూర్పు లద్దాఖ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.