తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్​ బస్​ డ్రైవర్​కు గుండెపోటు.. స్టీరింగ్​ పట్టుకుని ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడిన బాలిక - ప్రమాదం నుంచి రక్షించిన బాలిక

విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల బస్సు అదుపు తప్పి అనేక వాహనాలు ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ బాలిక.. బస్సును ప్రమాదం నుంచి తప్పించింది.

School Bus Driver Suffered A Heart Attack
School Bus Driver Suffered A Heart Attack

By

Published : Feb 5, 2023, 4:29 PM IST

Updated : Feb 5, 2023, 4:45 PM IST

గుజరాత్​ రాజ్​కోట్​లో విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్​ బస్సుకు.. ఓ బాలిక కారణంగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల బస్సు అదుపు తప్పి అనేక వాహనాలు ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఓ బాలిక.. బస్సును ప్రమాదం నుంచి తప్పించింది. దీంతో బస్సులోని విద్యార్థులు సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.

రాజ్​కోట్​లోని భారడ్​ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తోంది. గొండాల్​ రోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి.. డివైడర్​ దాటి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది. దీనిని గమనించిన భార్గవి వ్యాస్​ అనే బాలిక స్టీరింగ్​ను పట్టుకుని బస్సును నియంత్రించే ప్రయత్నం చేసింది. రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి బస్సు ఆపింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. గుండెపోటుకు గురైన డ్రైవర్​ హరున్​భాయి ప్రస్తుతం రాజ్​కోట్​ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

"నేను అస్ట్రోన్​ చౌక్​ వద్ద బస్సు ఎక్కి డ్రైవర్​ పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాను. భక్తినగర్​ సర్కిల్ వద్ద కొందరు విద్యార్థులు బస్సు ఎక్కారు. ఆ తర్వాత బస్సు గొండాల్​ రోడ్డు వద్దకు చేరుకోగానే.. డ్రైవర్​ మాటలు తడబడ్డాయి. అతడి నోరు ఒకవైపునకు వచ్చేసి.. ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగ్​ వదిలేసి ఒక పక్కకు పడిపోయాడు. దీంతో బస్సు డివైడర్​ దాటి ఎదురుగా ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. దీనిని గమనించి నేను వెంటనే స్టీరింగ్​ పట్టుకుని బస్సును కరెంట్ స్తంభానికి ఢీకొట్టి ఆపాను."

Last Updated : Feb 5, 2023, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details