తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి ముందు బెంగళూరులోని తన అన్నయ్య సత్యనారాయణరావును కలిశారు. రజనీ తన ఆశీర్వాదం కోసం వచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు. అయితే తలైవా రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
"రజనీ మాట మీద నిలబడే మనిషి. ఏదైనా చెప్తే చేస్తారు. మేము కలిసి చాలా రోజులైంది. ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన(రజనీ) రాజకీయం రంగ ప్రవేశం గురించి నేను ఏమీ మాట్లాడను. డిసెంబర్ 31న రజనీయే స్వయంగా మాట్లాడతారు. తనకి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి."
- సత్యనారాయణ, రజనీ సోదరుడు