రాజస్థాన్ ధోల్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది: ప్రధాన నిందితుడు మైనర్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌కు మాయమాటలు చెప్పి అతని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మిగతా నిందితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసిన నిందితులు.. రూ.లక్ష ఇవ్వకపోతే వీడియోను వైరల్ చేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ తమ దృష్టికి రావడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.
మైనర్‌పై తండ్రీకొడుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగింది. గర్భవతైన కోడలిని చూసుకునేందుకు బంధువైన ఆ 14 ఏళ్ల బాలికను సుమారు నెల రోజుల క్రితం నిందితులు తమ ఇంటికి తీసుకువచ్చారు. అయితే వివిధ సందర్భాల్లో వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడేవారు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఐటీ ఉద్యోగినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బంగాల్లోని కోల్‌కతాలో జరిగింది. గత శనివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ హోటల్లో జరిగిన ఆఫీస్ పార్టీకి హాజరైన బాధితురాలికి మద్యం తాగించిన నిందితులు.. రూంకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి :మేనకోడలిపై బిజినెస్‌మ్యాన్ అత్యాచారం.. దావూద్ గ్యాంగ్‌తో చంపిస్తానంటూ..