పవన్ వ్యాస్ అనే యువకుడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. తలపాగా చుట్టి ఈ రికార్డు సాధించడం విశేషం. కాకపోతే... ఈయన చుట్టింది ఒక మీటరో లేక రెండు మీటర్ల వస్త్రంతో చేసిన తలపాగా కాదు. ఏకంగా 450 మీటర్లు (1476 అడుగుల) పొడవున్న వస్త్రాన్ని కేవలం అరగంట వ్యవధిలో రాహుల్ శంకర్ తన్వీ అనే ఆయన తలకు చుట్టేశాడు.
రికార్డుకు 'పాగా' వేసిన యువకుడు - పవన్ వ్యాస్
చేతివేళ్లతో భారీ పాగా చుట్టి రికార్డు సాధించాడు ఓ 20 ఏళ్ల యువకుడు. 450 మీటర్లున్న ఈ పాగాని కేవలం అరగంట వ్యవధిలో చుట్టడం విశేషం. గతంలో ఉన్న రికార్డును తిరగరాసేందుకు ఇలా చేసానని యువకుడు చెప్పాడు.
రికార్డుకు 'పాగా' వేసిన యువకుడు
గతంలో ఉన్న 400 మీటర్ల రికార్డును తిరగరాయడమే లక్ష్యంగా బుధవారం రాజస్థాన్ బీకానేర్లో 450 మీటర్ల వస్త్రంతో ప్రయత్నించానని పవన్ వివరించారు. చేతివేళ్లపై రాజస్థాని తలపాగాలు చుట్టినందుకు ఆయన పేరు ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది.
ఇదీ చదవండి:మిఠాయిల్లో ప్రత్యేకం ఈ 'బాబర్షా'