తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య బీమా

రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొస్తూ రాజస్థాన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించడం దేశంలో ఇదే తొలిసారి.

Rajasthan launches health insurance scheme for all, claims it to be a first
ప్రజలందరికి ఆరోగ్య బీమా-దేశంలో తొలిసారి

By

Published : Apr 1, 2021, 6:27 PM IST

రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొస్తూ రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరికీ బీమా కల్పించటం దేశంలోనే తొలిసారి. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చిరంజీవి ఆరోగ్య బీమా పథకం కింద.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పించింది.

ఇటీవల బడ్జెట్‌లో ఈ పథకం గురించి సీఎం అశోక్‌ గెహ్లాత్‌ ప్రస్తావించగా.. తాజాగా దాని అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రజలంతా చిరంజీవి ఆరోగ్య బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు బీమా వర్తించనుంది. తద్వారా ప్రజలంతా నగదు రహిత చికిత్స పొందవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'రీ-ఇన్‌ఫెక్షన్‌'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే

ABOUT THE AUTHOR

...view details