రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఐదుగురు పిల్లలతో సహా కెనాల్లో దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు 9 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జాలోర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శంకర్ లాల్, బద్లి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. అయితే తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. అలా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శంకర్ మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం సిద్ధిశ్వేర్ అనే గ్రామ సమీపంలోని నర్మద కెనాల్ వద్దకు భార్య, ఐదుగురు పిల్లలతో సహా వెళ్లాడు. అనంతరం అందులో దూకేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన గలిఫా అనే గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి భన్వర్ సింగ్ రాజ్‌పుత్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ విషయంపై జాలోర్ జిల్లా యంత్రాంగం స్పందించి.. మృతదేహాలను వెలికి తీయడానికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించింది. కాగా, ఇప్పటివరకు శంకర్ లాల్ కుమారుడు 9 ఏళ్ల ప్రకాశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
ఐదుగురు పిల్లలతో కెనాల్లో దూకి దంపతుల ఆత్మహత్య.. ఫోన్లో త్రిపుల్ తలాక్ - chattisgarh triple talak over phone
కెనాల్లో దూకి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. తమ ఐదుగురు పిల్లలతో సహా దంపతులిద్దరూ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరో వైపు ఫోన్లో భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన రాయ్‌పుర్‌లో జరిగింది.
త్రిపుల్ తలాక్..
ఫోన్లో తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులివ్వబోయాడో వ్యక్తి. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
పోలీసుల వివరాలు ప్రకారం.. మహ్మద్ షమిన్(36), నసీమ బానో(32) అనే దంపతులు మనేంద్రగడ్ అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరికి గతేడాది సెప్టెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులు బాగానే ఉన్న మహ్మద్.. ఆ తర్వాత నుంచి నసీమను వేధించేవాడు. 'నీ చర్మం డ్రైగా ఉంది. నేను ఇంకొకరిని పెళ్లిచేసుకుంటాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో' అంటూ తరచూ నసీమతో గొడవ పడేవాడు. కాగా, పుట్టింట్లో ఉన్న నసీమకు ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన నసీమ.. మానసికంగా కుంగిపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి.. మహ్మద్ షమిన్పై ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం మహ్మద్ షమిన్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై 498 ఏ, సెక్షన్ 4, వివాహ హక్కుల చట్టం 2019. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.