మెడికల్ ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలకు యుద్ధప్రాతిపదికన రైల్వే, వైమానిక దళం ద్వారా ఆక్సిజన్ ట్యాంకులను సరఫరా చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దేశంలో కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఔషధాలను, ఆక్సిజన్‌ను సమకూర్చుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
"కలిసికట్టుగా ఉండటం వల్లే మొదటి దశలో కరోనాను భారత్ జయించింది . ఇప్పుడు కూడా అదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఈ విషయంలో కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుంది. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి."