Railway Ticket Concession :రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొవిడ్‌కు ముందు సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్‌పై ఇచ్చిన రాయితీలను పునురుద్ధరణపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సమాధానమిచ్చారు.
కొవిడ్‌కు ముందు సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్‌పై ప్రభుత్వం 50శాతం రాయితీ ఇచ్చేది. 2020 మార్చి 20 తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించింది. అప్పటి నుంచి వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. లాక్డౌన్ తర్వాత రైళ్లు నడిచినా ఆ రాయితీలను కేంద్రం పునరుద్ధరించలేదు. అనేకసార్లు రైల్వే రాయితీ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తినా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తటస్థ వైఖరిని ప్రదర్శించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్‌పై రాయితీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా స్పందించారు. ' ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలు టికెట్‌కు రూ. 100 ఉంటే, రైల్వే రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ రూ. 55 రాయితీ ఇస్తోంది' అన్నారు.