550 ఖాళీలకు రైల్వే నోటిఫికేషన్.. పదో తరగతి పాసైతే చాలు.. అప్లై ఎలాగంటే?
అప్రెంటిస్ పోస్టులకు రైల్వే బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 550 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. పదో తరగతి పాసైన వారు సైతం ఈ పోస్టలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.
రైల్వే కోచ్ ఫాక్టరీ(ఆర్సీఎఫ్) కపుర్తలా 550 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల
By
Published : Feb 9, 2023, 12:31 PM IST
మీరు పది పాసయ్యారా..? రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. రైల్వే కోచ్ ఫాక్టరీ(ఆర్సీఎఫ్) కపుర్తలా 550 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పది, ఇంటర్ పూర్తయిన వాళ్లు ఈ పోస్టలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు
ఫిట్టర్
215
వెల్డర్ (G&E)
230
మెషినిస్ట్
05
పెయింటర్(జి)
05
కార్పెంటర్
05
ఎలక్ట్రిషియన్
75
AC& Ref. మెకానిక్
15
నోటిఫికేషన్ వివరాలు
పోస్ట్ పేరు
అప్రెంటిస్
సంస్థ పేరు
రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలా
ప్రకటన నం.
A-1/2023
పోస్ట్‌లు
550
కనీస వయస్సు
15 సంవత్సరాలు
గరిష్ట వయస్సు
24 సంవత్సరాలు
అప్లికేషన్ ప్రారంభతేదీ
2023, ఫిబ్రవరి 8
అప్లికేషన్ చివరితేదీ
2023, మార్చి 4
అప్లికేషన్ మోడ్
ఆన్‌లైన్
విద్యార్హత అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
ఎంపిక విధానం ఐటీఐ, మెట్రిక్యూలేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. చివరగా ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల తర్వాత తుది ఎంపిక అనేది జరుగుతుంది.
ఫీజు
అప్లికేషన్ ఫీజు రూ.100
sc/st/pwd/మహిళలకు ఫీజు లేదు
అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత ఫామ్‌లో ఉన్న లింక్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఆసక్తి గల అభ్యర్థులు https://rcf.indianrailways.gov.in వైబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.