తొమ్మిదో తరగతి విద్యార్థిని పాఠశాలలోనే కత్తితో పొడిచి(Stabbing) హత్య చేశారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
రామభాఠా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాగర్ టండన్ అనే విద్యార్థి మధ్యాహ్నం భోజన విరామంలో తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతున్నాడు. ఆ సమయంలోనే ఇద్దరు యువకులు సాగర్ వద్దకు వచ్చి తీవ్రంగా కొట్టారు. కత్తితో పొడిచి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
భయాబ్రాంతులైన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. సాగర్‌ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు స్కూలు టీచర్లు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఓ నిందితుడిని తానుల్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మరో వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. హత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ప్రియురాలి తండ్రిని హత్య చేసిన వన్‌సైడ్ లవర్