లాకౌడౌన్ విధింపుతో ఆర్థికవ్యవస్థపై కలిగే ప్రతికూల ప్రభావం గురించి ప్రభుత్వం ఆందోళన చెందవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ సూచించారు. వైరస్ వ్యాప్తితో పౌరులు విషాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
"ప్రభుత్వానికి కరోనా టీకా విషయంలో స్పష్టమైన వ్యూహం లేకపోవడం, వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ మహమ్మారిపై విజయం సాధించినట్లు ప్రకటించడంమే దేశాన్ని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంచాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో వినాశకరమైన జాతీయ లాక్డౌన్ దాదాపు అనివార్యమైంది."
-రాహుల్ గాంధీ
లాక్డౌన్ విధింపునకు ప్రజలను సిద్ధం చేయడం క్లిష్టమైనదేనని అభిప్రాయపడ్డారు రాహుల్. అయితే సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదల ఖాతాల్లో రూ.6000 జమచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"గత సంవత్సరం విధించిన లాక్డౌన్ వల్ల సంభవించిన పేదల బాధలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం కరుణతో వ్యవహరించాలి. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సహాయంతో పాటు ఆహారన్ని అందించాలి."