Rahul Gandhi Siddu Moosewala Family: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్లోని మాన్సా జిల్లాను సందర్శించారు. ఇటీవలే హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మంగళవారం ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్.. నేరుగా సిద్ధూ స్వగ్రామమైన మూసాకు వెళ్లారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మూసేవాలా నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
శనివారం మూసేవాలా తల్లిదండ్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా మూసేవాలా కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని, తద్వారా కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని సీఎం మాన్కు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మంగళవారం లేఖ రాశారు. మరోవైపు, ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదులెవరూ వాదించకూడదని తాము తీర్మానించామని జల్లా లాయర్ల అసోసియేషన్ తెలిపింది. సిద్ధూ కుటుంబానికి న్యాయపరంగా ఉచితంగా సహాయం చేస్తామని న్యాయవాదులు చెప్పారు.