మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. అందుకోసమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. కేరళ పర్యటనలో భాగంగా కొల్లాం జిల్లాలోని థంగసేరి బీచ్లో మత్స్యకారులతో రాహుల్ ముచ్చటించారు.
మత్స్యకారుల సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాహుల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తమ యూడీఎఫ్ కూటమి రూపొందిస్తుందని తెలిపారు.
"రైతులు భూమిని సాగు చేసి పంట పండించినట్లే, మీరు(మత్స్యకారులు) సముద్రంలోకెళ్లి చేపలు పడుతారు. మీరు చేసేది కూడా వ్యవసాయమే. కేంద్రంలో వ్యవసాయానికి మంత్రిత్వశాఖ ఉంది. మత్స్యకారులకు సంబంధించి మంత్రిత్వశాఖ లేదు. దీన్ని సాధించేందుకు నేను ప్రయత్నిస్తాను. దాంతో మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు."
-రాహుల్ గాంధీ.