తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rahul Gandhi: 'పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టంలేదు' - రాహుల్​ గాంధీకి విషెస్

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) జన్మదినం(Birthday) సందర్భంగా పలువురు నేతలు ట్విటర్​ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. దేశం కొవిడ్​ రెండో దశ వ్యాప్తిలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టంలేదని రాహుల్ తెలిపారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

By

Published : Jun 19, 2021, 3:57 PM IST

కాంగ్రెస్(Congress) నేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi) పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో బర్త్​డే(Birthday) జరుపుకోవడం ఇష్టం లేదని తెలిపారు రాహుల్.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ- సోనియా గాంధీ దంపతులకు 1970, జూన్​ 19న రాహుల్​ జన్మించారు.

సేవా దివస్..

రాహుల్​ పుట్టినరోజును.. 'సేవా దివస్'గా గుర్తిస్తున్నట్లు కాంగ్రెస్​ తెలిపింది. ఉచితంగా మాస్కులు, మెడిసిన్ కిట్లు, ఫుడ్​ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. మరోవైపు యూత్​ కాంగ్రెస్​ దిల్లీలోని పేదలకు ఉచితంగా రేషన్​ అందిస్తోంది. కాంగ్రెస్​ స్టూడెంట్స్ వింగ్.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్​ ఆఫ్ ఇండియా ఫ్రీ వ్యాక్సినేషన్​ క్యాంప్​ను నిర్వహించింది.

ట్వీట్​ విషెస్..

"రాహుల్​ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు జరుపుకోవాలని అనుకోవడం లేదు. కాంగ్రెస్​ కార్యకర్తలు.. తమ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని రాహుల్ కోరారు." అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

స్టాలిన్ ట్వీట్
కేజ్రీవాల్ ట్వీట్

ప్రముఖులు ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కాన్రాడ్ సంగ్మా, అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లోత్, భూపేశ్ భఘేల్, శివరాజ్​ సింగ్ చౌహాన్.. రాహుల్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:సోనియా, రాహుల్​ టీకా తీసుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details