Rahul Gandhi T shirt : భారత్ జోడో పేరిట కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధరించిన ఓ టీషర్ట్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ టీషర్ట్ ధర ఏకంగా రూ.41,257 అంటూ కాంగ్రెస్‌పై భాజపా విమర్శలు గుప్పించింది. రాహుల్ ఫొటో, పక్కనే ద బర్బరీ టీషర్ట్ ధరతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'భారత్, దేఖో(భారత్, చూడు)' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలు షేర్ చేసి, కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసింది.
భాజపా ట్వీట్‌పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. "భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి భయం వేసిందా? అసలు విషయాలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడు. దుస్తుల గురించే మాట్లాడదాం అంటే.. మోదీ వేసుకున్న రూ.10లక్షల సూట్, పెట్టుకున్న రూ.1.5లక్షల కళ్లద్దాల గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది" అని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్.