కేరళలో పర్యటిస్తూ మత్స్యకారులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మమేకమవుతున్నారు. కొల్లాం జిల్లాలోని థంగసేరి బీచ్లో బుధవారం(ఫిబ్రవరి24న) చేపలు పట్టిన రాహుల్.. మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సాగరంలో సరదాగా రాహుల్ గాంధీ ఈత - ఈత కొట్టిన రాహుల్
కేరళ కొల్లాం జిల్లాలో పర్యటిస్తూ బుధవారం సముద్రంలో చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. మత్స్యకారులతో కలిసి ఈత కొట్టారు. సాగరంలో సరదాగా గడిపిన రాహుల్ వీడియో వైరల్ అవుతోంది.
మత్స్యకారులతో సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ
మత్స్యకారులకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని డిమాండ్ చేశారు రాహుల్. గత నెలలో పుదుచ్చేరి పర్యటనలో కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం వల్ల పలువురు కేంద్రమంత్రులు.. రాహుల్పై విమర్శలు చేశారు.
ఇదీ చూడండి:లైవ్: పుదుచ్చేరిలో విద్యార్థులు, మత్స్యకారులతో రాహుల్ భేటీ
Last Updated : Feb 25, 2021, 11:43 AM IST