కొవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వటంలో కేంద్రం విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు తెలియజేయటాన్ని తప్పుపట్టారు. ప్రాణానికి విలువ కట్టడం అసంభవమని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటం ఓ చిన్న సాయమన్నారు. మోదీ ప్రభుత్వం అది కూడా చేయటానికి సిద్ధంగా లేదని రాహుల్ ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు.
"మహమ్మారి వ్యాప్తి సమయంలో తొలుత సరైన చికిత్స అందించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత తప్పుడు లెక్కలు చూపించింది."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత