హిందూ మతం, హిందుత్వం.. రెండు వేర్వేరు విషయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi news) వ్యాఖ్యానించారు. ఒకవేళ అవి ఒకటే అయితే వాటికి రెండు పేర్లు ఎందుకున్నాయన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన 'జన్ జాగరణ్ అభియాన్'(jan jagran abhiyan) డిజిటల్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రాహుల్. భాజపా, కాంగ్రెస్ సిద్ధాంతాల మధ్య వైరుద్ధ్యాల గురించి మాట్లాడారు.
"హిందూ మతానికి, హిందుత్వానికి మధ్య బేధాలేంటి? ఆ రెండు ఒకటి కాదా? ఆ రెండు కచ్చితంగా ఒకటి కాదు. హిందూ మతం అంటే సిక్కును, ముస్లింలను కొట్టడమా? కానీ హిందుత్వం అంటే అదే! ఈ రోజున ఆర్ఎస్ఎస్, భాజపా విద్వేషపూరిత భావజాలం.. కాంగ్రెస్‌కున్న ప్రేమించే గుణం, మనం చూపించే ఆప్యాయత, పార్టీ జాతీయవాద సిద్ధాంతాన్ని పూర్తిగా అధిగమించేసింది. ఇది వాస్తవం. మన సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. కానీ వారి సిద్ధాంతాలు పైచేయి సాధించాయి. మన సిద్ధాంతాలను, మన ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాము. అందుకే ఇలా జరుగుతోంది."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి 29 వరకు జన్ జాగరణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది కాంగ్రెస్(congress party news today).