Rahul Gandhi On Lynching: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2014కు ముందు.. అంటే భాజపా అధికారంలోకి రాకముందు దేశంలో 'మూకదాడి' అన్న పదం అంటే ఏంటో తెలియదన్నారు. ఈ మేరకు 'థ్యాంక్యూ మోదీజీ' అంటూ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు రాహుల్.
అయితే రాహల్ ట్వీట్‌పై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ.. 'మూకదాడులకు ఆద్యుడు'గా అభివర్ణించారు. 1984 అల్లర్లలో వందలమంది సిక్కుల హత్యలు మూకదాడి కాదా? అని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రశ్నించారు.
1989లో జరిగింది మూకదాడి కాదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు చౌబే. కాంగ్రెస్ పాలనలో 1969 నుంచి 1993 వరకు దేశంలో అనేక మూకదాడులు జరిగాయని భాజపా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ యువకుడ్ని కొట్టిచంపారు కొందరు భక్తులు. ఈ ఘటన డిసెంబరు 18న జరిగింది. డిసెంబరు 19న కపుర్తలాలోని నిజాంపుర్లో సిక్కుల జెండాను అగౌరవపరిచాడన్న కారణంతో మరో వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి కూడా చనిపోయాడు.
అతన్ని వదిలిపెట్టం..