Rahul Gandhi on Hijab: కర్ణాటకలోని పలు కళాశాలల్లో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అడ్డుకున్న ఘటనపై వివాదం చెలరేగుతున్న వేళ.....కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారికి మద్దతు తెలిపారు. ఆడపిల్లల భవిష్యత్తును దేశంలో దోచుకుంటున్నారని మండిపడ్డారు. సరస్వతీ దేవి ఎవరి పట్ల వివక్ష చూపించరని, ఆమె అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
Rahul Gandhi on Hijab: 'దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోచుకుంటున్నారు' - రాహుల్ గాంధీ
Rahul Gandhi on Hijab: దేశంలో ఆడపిల్లల భవిష్యత్తును దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
Rahul Gandhi on hijab
కర్ణాటక ఉడిపిలోని రెండు కళాశాలల్లో హిజాబ్ ధరించి రావడం నిబంధనలకు విరుద్ధం అని ముస్లిం విద్యార్ధినులను అధికారులు అనుమతించకపోవడం వల్ల వివాదం రేగింది.
ఇదీ చూడండి:హిజాబ్ వివాదం- కాషాయ శాలువాలకు అనుమతివ్వాలని ఆందోళన