తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్ - వ్యాక్సినేషన్​పై రాహుల్ ట్వీట్

దేశప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచితం అర్థాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, వ్యాక్సినేషన్

By

Published : Apr 29, 2021, 2:24 PM IST

దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉచితం అంటే అర్థం ఇదే అంటూ ఓ ట్వీట్​ చేశాడు.

"ఫ్రీ అంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేనిది. ధర ఏమి ఉండనిది. భారత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ ఇవ్వడం అవసరం. ఈసారైనా అది సాధ్యమవుతుందని ఆశిద్దాం."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను తప్పుపట్టిన రాహుల్.. ఇది మోసపూరిత చర్య అని అన్నారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్, స్పాట్​ రిజిస్ట్రేషన్ పద్ధతి వల్ల చాలా మంది వ్యాక్సిన్​ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'

ABOUT THE AUTHOR

...view details