తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ట్విట్టర్ పక్షపాతం- సర్కారు చెప్పిందే వేదం!' - rahul gandhi twitter news

ట్విట్టర్ సంస్థ నిస్పాక్షికంగా వ్యవహరించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. లక్షలాది మంది భావప్రకటనా స్వేచ్ఛను ట్విట్టర్ తిరస్కరిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఇది దాడి అని విమర్శించారు.

rahul gandhi twitter
రాహుల్ గాంధీ ట్విట్టర్

By

Published : Aug 13, 2021, 1:08 PM IST

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్​పై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ పక్షపాత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏది చెబితే అది వింటోందని.. తన ఖాతాను బ్లాక్ చేయడం ద్వారా దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. తమ అభిప్రాయాలను వినిపించేందుకు ట్విట్టర్ సరైన వేదిక అనే ఓ ఆశ ఇదివరకు ఉండేదని.. ఇప్పుడు అది ఉండటం లేదని పేర్కొన్నారు.

తనతో పాటు లక్షలాది మంది ఫాలోవర్ల భావప్రకటనా హక్కును ట్విట్టర్ హరిస్తోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఇది దాడి అని అన్నారు.

"ట్విట్టర్ నిస్పాక్షికంగా లేదన్న విషయం వాస్తవం. ఇది కేవలం రాహుల్ గాంధీ ఖాతాను నిలిపివేసినట్లు కాదు. నాకు 19-20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. వారి భావ వ్యక్తీకరణ హక్కునూ మీరు తిరస్కరిస్తున్నారు. మమ్మల్ని పార్లమెంట్​లో మాట్లాడేందుకు అనుమతించట్లేదు. మీడియాను నియంత్రిస్తున్నారు. మా ఆలోచనలను ట్విట్టర్​లో వ్యక్తం చేయవచ్చన్న ఆశ ఉండేది. కానీ ట్విట్టర్ అలా లేదు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చెబితే అది వింటోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు.

ప్రభుత్వానికి తలొగ్గే సంస్థలకే దేశంలో అనుమతులు ఉంటాయా? అని రాహుల్ ప్రశ్నించారు. రాజకీయంగా ఓ పక్షానికి మద్దతు ఇవ్వడం వల్ల ట్విట్టర్​కు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

దిల్లీలో.. హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. అదే సమయంలో.. కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు నిబంధనలను ఉల్లంఘించిన మరో 5 వేల కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details